భారతీయులు తినే పలు ఆహారపదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా 151వంటకాలపై జరిపిన పరిశోధనల్లో 26 భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట.
వాటిలో ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో పర్యావరణంపై ఆహారపదార్థాల ప్రభావం వెలుగు చూసిందట.