ఉదయం పూట ఏం తింటే ఆరోగ్యానికి మేలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.! బాదం తింటే మలబద్ధక సమస్య తొలగిపోతుంది. వీటితో చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఖర్జూరంలో విటమిన్లు, మినరల్స్, నేచురల్ షుగర్ పాళ్లు ఎక్కువ.
రోజంతా శక్తినిస్తాయి. వాల్నట్స్ తింటే ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఉదయం ఎండుద్రాక్షలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.