కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా తమ ఆహారంలో బీట్ రూట్ ని చేర్చుకోకూడదు. అవి తిన్నప్పుడు, మూత్రపిండాలు మరింత అనారోగ్యానికి గురవుతాయి. ఇందులోని ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. బీట్ రూట్ తినే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆక్సలేట్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.