నేడు పత్తిపాడులో బుధవారం నిర్వహించే టీడీపీ, జనసేన పార్టీల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, నియోజకవర్గ పరిశీలకురాలు పీతల సుజాత పిలుపునిచ్చారు. బిక్కవోలులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన మండలంలోని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు లక్ష్యానికి మించి కార్యకర్తలు, నేతలు హాజరు కావాలన్నారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మన సభకు ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదని, ప్రతిఒక్కరూ కార్లు, ద్విచక్రవాహనాల్లో సభకు రావాలన్నారు.