ఆరుతడి పంటలపై రైతులు దృష్టిసారించాలని భూగర్భ జలశాఖ ఏడీ డి.లక్ష్మణరావు తెలి పారు. మంగళవారం శ్రీకాకుళం , కురుం పేటలో కాశీసాగరం ఆయకట్టు రైతులకు ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకంలో భాగంగా యూత్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంట నీరు ప్రణాళికపై శిక్షణ నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ తక్కువ నీటితో పండించిన పంటలను వేసుకుని రైతులు ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ జియాలజిస్ట్ రమా శ్రీదేవి, ఏపీడీ లక్ష్మణరావు, సర్పంచ్ కొరికాన వెంకట శివసాయి, సీతారామరాజు, మాజీ సర్పంచ్ కొరికాన వెంకటరావు, రైతులు కత్తిర నరసింగరావు, విక్రమ్, వాసు, అశోక్‌కుమార్, యూత్ క్లబ్ ప్రతినిధులు కె.లక్ష్మణరావు, ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ పాల్గొన్నారు.