రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు కుమారుడి వివాహానికి ఆమె హాజరవుతారు. రాత్రికి నగరంలోనే నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం బీచ్‌రోడ్డులోని గోకుల్ పార్కు వద్ద పర్యాటక శాఖ వాహనాలను ప్రారంభిస్తారు. విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటుచేసిన ప్యాకేజీ టూర్లలో భాగంగా వీటిని జెండా ఊపి ప్రారంభిస్తారు. అయితే రుషికొండపై రూ.450 కోట్లు వెచ్చించి నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఆమె ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. అక్కడ భారీ భవంతులన్నీ పర్యాటకుల వసతి పేరుతో పర్యాటక శాఖ నిర్మించిన సంగతి తెలిసిందే. అందుకే ఆ శాఖా మంత్రితో ప్రారంభింపజేస్తారని అంటున్నారు.