పొత్తికడుపులో కొవ్వు పేరుకుంటే అది మెదడుపైన, గ్రహణ శక్తిపైనా దుష్ప్రభావం చూపుతుంది. ఈ ప్రమాదం మహిళల కన్నా నడివయసు పురుషులకే ఎక్కువ. ముఖ్యంగా కుటుంబంలో అల్జీమర్స్ ఉన్న పురుషులకు ఈ కొవ్వు వల్ల నష్టం అధికంగా ఉంటుంది. కాలేయం, ఉదరం, క్లోమగ్రంథి చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది మెదడు పరిమాణం కుంచించుకుపోవడానికి కారణమవుతుంది. అల్జీమర్స్‌తో చిత్తభ్రంశం చెందినవారి సంతానాన్ని పరిశీలించగా ఇది తేలింది.