జీవన శైలిలో మార్పుల కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉల్లి చేసే తల్లి చేయదనే సామెత మీరు వినే ఉంటారు. ఉల్లిపాయలు మధుమేహం నియంత్రణకు తోడ్పడుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉల్లిలోని ‘అల్లియమ్ సెపా’ అనే పదార్థం మన రక్తంలో చక్కెర స్థాయిలు 50 శాతం వరకు తగ్గించేందుకు తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.