వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని పోషకాల వల్ల వృద్ధాప్య లక్షణాలను నియంత్రించవచ్చు. ఎముకలకు పటిష్టత చేకూరుతుంది. పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు. వెల్లుల్లి రెమ్మల్ని పరగడుపున తీసుకోవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ ముప్పు తొలగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ నిర్మూలించబడుతుంది.