తులసిలోని యాంటీమైక్రోబియల్ గుణాలు చర్మ సమస్యలను, చర్మ వ్యాధులను పోగొడతాయి. ఓ 4 తులసి ఆకులు, 4 వేప ఆకుల్ని తీసుకుని కాసేపు నీళ్లల్లో నానబెట్టాలి. ఆ నీటికి చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా ఓ వారం రోజులపాటు చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.చెంచా తులసి ఆకుల పేస్ట్ కి పాలల్లో నానబెట్టిన చెంచా ఓట్మీల్, చెంచా తేనె, 2 చెంచాల బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి రుద్దుకోవాలి. 10 నిముషాలు అలా చేస్తే మృతకణాలు తగ్గి, ముఖంపై మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది.