2024-25 నుంచి ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలు ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. సీఏ ఫౌండేషన్ , ఇంటర్, ఫైనల్ ఇలా మూడు స్థాయిల్లో పరీక్షలు ఉంటాయి.
ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ముందుగా ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైతే సీఏ ఇంటర్లో రిజిస్టర్ చేసుకోవాలి. అందులో రెండు గ్రూపులు పాసైన తర్వాత ఫైనల్ పరీక్షలు ఉంటాయి. డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే నేరుగా సీఏ ఇంటర్ పరీక్షలకు హాజరవ్వొచ్చు.