ఇటీవల కాలంలో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. దీంతో కొత్తగా చదువులు పూర్తి చేసుకున్న వారు ఉద్యోగాల వేటలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే గతేడాదితో పోలిస్తే ఈ సారి ఫ్రెషర్లకు డిమాండ్ 6 శాతం పెరిగినట్లు కెరియర్ ఔట్లుక్ ఓ నివేదికలో వెల్లడించింది. బెంగళూరులో 69 శాతం ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగగా, ముంబైలో 58 శాతం, చెన్నై 51 శాతం, ఢిల్లీలో 45 శాతం డిమాండ్ పెరిగినట్లు నివేదిన పేర్కొంది.