హోలీ నాడు తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు. హోలీనాడు రాహువు చాలా కోపంగా ఉంటాడట. అందుకే ఆయన కోపాన్ని తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని ‘సనాతన ధర్మం’ చెబుతోంది. అంతేకాదు, వసంతంలో వచ్చే ఈ పండగ నాటికి ఎండ తీవ్రత పెరుగుతుంది. దాన్ని తట్టుకునేందుకు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం సంప్రదాయంగా వస్తోంది. పైగా రంగుల పండగ.. వర్ణాలన్నీ దుస్తులపై కనిపించి మురిపిస్తేనేగా సంబరం.
హిందువులు ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ ఈనెల 25న రాగా ఆ రోజున కొన్ని వస్తువులు దానం చేయరాదని పండితులు చెబుతున్నారు. డబ్బు, పాలు, పెరుగు, పంచదార, ఆవాల నూనె, తెల్లటి వస్తువులు, పెళ్లైన స్త్రీలు పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, స్టీల్ పాత్రలు వంటివి దానం చేయకూడదట. దానం చేస్తే కష్టాలు, నష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని చెబుతున్నారు.