గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒత్తిడి వివిధ సమస్యలకు కారణమని, యోగా, ధ్యానం చేయడంతో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. స్మోకింగ్, ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరమని,వాటిని ఎక్కువగా సేవించడంతో రక్తపోటు సరిగా ఉండదంటున్నారు.నిత్యం బరువును చెక్ చేసుకుంటూ ఉండటంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. బీఎంఐ ఇండెక్స్ సరిగా లేనప్పుడు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని సూచిస్తున్నారు.