గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. గుమ్మడి గింజల్లో B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రొమ్ము, కడుపు క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు.
వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా?
కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులకు శరీరంలో ఇన్సులిన్ లోపించడంతో ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు జీరో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వెల్లుల్లిని తినడం వల్ల సహజంగా ఇన్సులిన్ స్థాయిలు పెరిగి రక్తంలో డయాబెటిస్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 100 గ్రాముల వెల్లుల్లిలో 33 కేలరీలు, 6.6 కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6, సోడియం ఉంటాయని చెబుతున్నారు.