తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ వంటివి ఉండి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే తాటి ముంజల్లో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి. అందుకే తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.