మామిడిపండ్లు.. సమ్మర్ సీజన్ ఫ్రూట్. దీనిని ఎండాకాలంలో తినేందుకు చాలా ఇష్టపడతారు. అయితే, షుగర్ ఉన్నవారు ఎలా తింటే మంచిదో తెలుసుకోండి. పండ్ల రాజు ఎవరంటే మామిడిపండ్లు అని చెబుతారు. ఎండాకాలాన్ని ఇష్టపడడానికి ముఖ్య కారణం మామిడిపండ్లు అని కూడా చెప్పొచ్చు. ఇది నోటికి రుచిగా మాత్రమే కాదు.
ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని లస్సీ, ఐస్‌క్రీమ్, స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. లేదా అలానే తినొచ్చు. అయితే, కొంతమంది మామిడిపండ్లని తొక్కతో కాకుండా తొక్కలేకుండా తింటారు. ఇందులో ఎన్నో గుణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. మామిడితొక్కలో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ క్రిమినాశక గుణాలు ఉన్నాయి. మామిడి తొక్కలోని కొన్ని భాగాలు సహజ క్రిమిసంహారక మందుగా వాడొచ్చు. వీటి పొలాల్లో చీడపీడలను తొలగించడానికి వాడొచ్చు.