ఏప్రిల్ నెల రెండో అర్ధభాగంలోకి వచ్చేశాం. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి భయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏసీల వినియోగం భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటుతున్న క్రమంలో రోజులు 20 గంటల పాటు ఏసీలు నడిపిస్తున్న వారే ఎక్కువ. దీంతో కరెంట్ బిల్ తడిసి మోపెడవుతోంది. ఇన్నాళ్లు వందల్లో వచ్చిన బిల్ ఇప్పుడు వేలల్లో వస్తోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరి ఏసీ వాడుతూనే కరెంట్ బిల్ తగ్గించుకోవడం ఎలా? ఎలాంటి టిప్స్ పాటిస్తే ఏసీతో కరెంట్ బిల్ పెరగకుండా చూసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సరైన ఉష్ణోగ్రతనే ఎంచుకోవాలి..
ఏసీని వినియోగిస్తున్నప్పుడు కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద పెట్టకూడదు. చాలా మంది 16 డిగ్రీల స్థాయిలో రన్ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా త్వరగా రూమ్ చల్లబడుతుందని భావిస్తారు. కానీ, అది సరైన పద్ధతి కాదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (BEE) ప్రకారం.. మన శరీరానికి 24 డిగ్రీల ఉష్ణోగ్రత అనువైనది. ఈ స్థాయిలో పెట్టాలి. దాంతో లోడ్ అనేది ఉండదు. 24 డిగ్రీల స్థాయిలో పెట్టడం ద్వారా చాలా వరకు కరెంట్ సేవ్ అవుతుంది.
పవర్ బట్ ఆఫ్ చేయాలి..
ఎలక్ట్రికల్ వస్తువులు ఉపయోగంలో లేనప్పుడు వాటి పవర్ బటన్ ఆఫ్ చేయాలి. చాలా మంది ఏసీలను రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తుంటారు. కానీ, అది సరైన పద్ధతి కాదు. దాంతో కంప్రెసర్ అనేది ఐడియల్ లోడ్ మోడ్ లోకి వెళ్లి పవర్ వినియోగిస్తుంది. దీంతో మీకు తెలియకుండానే కరెంట్ బిల్ పెరుగుతుంది.
టైమర్ ఉపయోగించడం మంచిది..
దాదాపు అన్ని ఏసీల్లో టైమర్ అనేది ఉంటుంది. రాత్రంతా ఏసీని ఉపయోగించకుండా టైమర్ ఉపయోగింతడం తెలివైన పని. పడుకునే ముందు నుంచి 2- 3 గంటల వరకు ఏసీ పని చేసేలా టైమర్ పెట్టుకోవాలి. ఆ సమయానికి ఏసీ ఆగిపోవడంతో విద్యుత్తు సేవ్ అవుతుంది. బిల్లూ తగ్గిపోతుంది.
తరుచుగా సర్వీస్ చేయించాలి..
ఏ వస్తువైన మెరుగైన పనితీరు ఉండాలంటే సర్వీసింగ్ అనేది ముఖ్యం. ఏసీలను సైతం ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి. చాలా సంస్థలు తమ కంపెనీ ఏసీని త్వరగా సర్వీసింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ చెబుతాయి. కానీ, అది నిజం కాకపోవచ్చు. అలాగే చాలా మంది ఏసీని కేవలం ఎండాకాలంలోనే ఉపయోగిస్తారు. అందుకే సర్వీసింగ్ అనేది తప్పనిసరి. అందులో దుమ్ము, ఇతర పార్టికల్స్ ఉంటే ఏసీని పాటు చేస్తాయి. దీంతో కరెంట్ బిల్ పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి..ఏసీని ఆన్ చేసే ముందే ఇంటి తలుపులు, కిటికీలను మూసేయాలి. అవి మూసి ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేయాలి. గదిలోకి బయటి గాలి రాకుండా అన్నింటిని మూసి ఉంచడం ద్వారా గది త్వరగా చల్లబడుతుంది. దీంతో కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది.