రేగిపండ్లను ఎక్కువగా తీసుకుంటే.. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రేగిపండ్లు రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తాయి. రేగిపండ్లలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్‌ల బారినపడకుండా కాపాడుతుంది. ఇవి జీర్ణశక్తికి, ఆకలిపెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.