ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.528 కోట్లతో పోలిస్తే 19 రెట్లు అధికం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.40,526 కోట్లకు చేరుకుంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 4.3% పెరిగి 4.71 మిలియన్ టన్నులుగా నమోదైంది. ప్రతి బ్యారెల్ ముడి చమురుపై 80.81 డాలర్లను సంస్థ ఆర్జించింది.