వర్షాకాలంలో వర్షాలు పడటం వల్ల వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల రకరకాల క్రిములు, కీటకాలు భూమి నుంచి బయటకు వస్తాయి. అవి కుడితే ఫంగస్‌తో కూడిన పుళ్ళు ఏర్పడతాయి. అందుకే వర్షాకాలంలో చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా జ్వరాలు, విరేచనాలు, వాంతులు, జలుగు, దగ్గు వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి ఫ్లూ జ్వరాలు, విరోచనాలు, వాంతులు కూడా చిన్నారులలో ప్రధానంగా కనిపిస్తాయి.