దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈక్విటీలో గూగుల్ మైనారిటీ వాటా తీసుకుంటోంది. సుమారు 35 కోట్ల డాలర్లు పెట్టుబడులుగా పెట్టడం ద్వారా ఈ వాటాను గూగుల్ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా కొత్తగా 100 కోట్ల డాలర్ల పెట్టుబడుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిడ్స్ ఆహ్వానించింది. ఇందులో 60 కోట్ల డాలర్లు మాతృ సంస్థ వాల్‌మార్ట్ పెట్టనుండగా గూగుల్ 35 డాలర్లు సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.