వేసవిలో లభించే పుచ్చకాయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా అందాన్ని రెట్టింపు చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు ఎండకు కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం తాజాగా మారుతుంది. తరచూ ఇలా చేస్తే చర్మం నిగారిస్తుంది. పుచ్చకాయ గింజలు కూడా జుట్టు, చర్మ సంరక్షణలో సాయపడతాయి. నేరుగా తినలేకపోతే ఎండబెట్టి వేయించి తినొచ్చు లేదా పొడి చేసి సలాడ్స్, సూప్స్, స్మూతీలలో వేసుకోవచ్చు.