వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలన్నింటిలో శని గ్రహానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. శని అశుభ గ్రహంగా పరిగణిస్తారు.కానీ శని కర్మ ఫలాలను ఇచ్చే గ్రహం. జూన్ 29వ తేదీ రాత్రి 11 గంటల 40 నిమిషాలకు శని కుంభ రాశిలో శని తిరోగమనం చెందుతుంది. కుంభ రాశిలో శని తిరోగమనం మొత్తం 139రోజుల పాటు జరుగుతుంది.
మేషరాశి
శని తిరోగమనం కారణంగా మేషరాశి వారికి లబ్ది కలుగుతుంది. మేష రాశి జాతకులు శని తిరోగమనం చెందే 139రోజుల పాటు మీ కెరీర్ బాగుంటుంది. మీ ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార భాగస్వాముల సహాయంతో, వారి స్వంత వ్యాపారాలను నిర్వహించే వ్యక్తులు ఇప్పుడు ఆరోగ్యకరమైన లాభాలను చూస్తారు. ఈ కాలంలో మీరు మీ పోటీదారులను ధీటుగా ఎదుర్కొంటారు.
కుంభరాశి
శని తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులకు లబ్ది జరుగుతుంది. ఇప్పటినుంచి కుంభ రాశి వారికి తిరోగమనం నుండి మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు . వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. ఈ రాజ యోగం కారణంగా కుంభరాశి జాతకుల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వచ్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుంది.
మిధున రాశి
కుంభరాశిలో శని తిరోగమన కాలంలో మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిధున రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులు రాణిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు అన్ని పూర్తి అవుతాయి. ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి.
తులా రాశి
కుంభరాశిలో శని తిరోగమనం ఫలితంగా తులారాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు వృత్తిలో విజయాలు సాధిస్తారు. వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. తులా రాశి వారు చేసే ప్లాన్లు ఏవైనా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం దొరుకుతుంది. ఈ సమయం అన్ని విధాల కలిసొస్తుంది.