హోం లోన్లపై వడ్డీ రేట్లు చాలా బ్యాంకుల్లో గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ఆర్బీఐ రెపో రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచిన నేపథ్యంలో చాలా బ్యాంకులు ఎక్కువగానే వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇక బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు రూ. 75 లక్షల హోం లోన్ తీసుకుంటే.. ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుంది వంటి వివరాలు తెలుసుకుందాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోం లోన్లపై 8.35 శాతం వడ్డీ కింద రూ. 75 లక్షల గృహ రుణంపై 20 ఏళ్లకు రూ. 63,900 చొప్పున ఉంటుంది.
>> పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు 8.4 శాతం హోం లోన్లు అందిస్తున్నాయి. రూ. 75 లక్షల హోం లోన్ 20 ఏళ్ల వ్యవధిపై నెలవారీగా ఈఎంఐ రూ. 64,200 అవుతుంది.
>> కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50 హోం లోన్లు అందిస్తాయి. రూ. 75 లక్షల హోం లోన్ 20 ఏళ్లకు నెలవారీగా ఈఎంఐ రూ. 64,650 గా ఉంది.
>> కోటక్ మహీంద్రా బ్యాంకు హోం లోన్లపై 8.7 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. రూ. 75 లక్షల లోన్‌పై రూ. 64,550 ఈఎంఐతో 20 ఏళ్లు కట్టాలి.
>> ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ అత్యంత చౌకైన హోం లోన్ అందిస్తుంది. 75 లక్షల హోం లోన్ కోసం 20 ఏళ్లలో నెలవారీగా ఈఎంఐ రూ. 65,750 గా ఉంది.
>> ఐసీఐసీఐ బ్యాంకు హోం లోన్లపై 9 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. రూ. 75 లక్షలు, 20 లక్షల హోం లోన్‌పై ఈఎంఐ రూ. 66,975 అవుతుంది.
>> అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ హోం లోన్లపై 9.15 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. 20 ఏళ్లకు ఇక్కడ రూ. 75 లక్షల లోన్‌పై రూ. 67,725 ఈఎంఐ పడుతుంది.
>> అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు హోం లోన్లపై 9.40 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. రూ. 75 లక్షల హోం లోన్.. 20 ఏళ్లకు ఈఎంఐ రూ. 68,850 గా ఉంటుంది.
>> యెస్ బ్యాంకులో హోం లోన్లపై 9.40 శాతం వడ్డీ ఉంది. ఇక్కడ రూ. 75 లక్షల గృహ రుణంపై 20 ఏళ్లకు రూ. 68,850 ఈఎంఐ పడుతుంది.