ఈక్విటీ పెట్టుబడిదారులకు మంచి అవకాశం. ఈ వారం మూడు కొత్త మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఎఫ్‌లు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం నుంచే న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వస్తాయి. అందులో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, బరోడా బీఎన్‌పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్ ఉన్నట్లు ఏస్ మ్యూచువల్ ఫండ్స్ డేటా వెల్లడించింది. ఈ ఫండ్స్ థెమాటిక్ ఫండ్స్ కేటగిరీలో ఉన్నాయి. మూడింటిలో క్వాంట్ ఫండ్, స్పెషల్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్, మాన్యుఫాక్చరింగ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌కి రానున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్ తేదీలు ఇప్పుడు మనం ఓసారి పరిశీలిద్దాం.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తోన్న కొత్త క్వాంట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 10వ తేదీన ఓపెన్ కానుంది. జూన్ 24వ తేదీతో ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. ఈ స్కీమ్ నిఫ్టీ 200 టీఆర్ఐ బెచ్‌మార్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించగా.. గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకాన్ని ఫండ్ మేనేజర్ హరిష్ క్రిష్ణన్ నిర్వహిస్తారు.
కోటక్ స్పెషల్ ఆపర్చ్యూనిటిసీ ఫండ్..
కోటక్ స్పెషల్ ఆపర్చ్యూనిటీస్ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 10వ తేదీన మొదలై జూన్ 24వ తేదీన ముగుస్తుంది. ఈ స్కీమ్ ఓపెన్ ఎండెడ్ ఈక్వీటీ స్కీమ్. ప్రత్యేక పరిస్థితులను కలిగి ఉంటుంది. నిఫ్టీ 500 టీఆర్ఐ బెచ్‌మార్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పథకాన్ని దేవేందర్ సింఘాల్, అర్జున్ ఖన్నా నిర్వహిస్తారు.
బరోడా బీఎన్‌పీ పరిబాస్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్..
బరోడా బీఎన్‌పీ పరిబాస్ మాన్యుఫాక్చరింగ్ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 10వ తేదీన ప్రారంభమవుతుంది. జూన్ 24వ తేదీన ముగుస్తుంది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. తయారీ రంగంలోని ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతుంది. అలాగే నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ టీఆర్ఐ బెచ్‌మార్క్‌లో చేయబడుతుంది. ఈ పథకాన్ని జితేందర్ శ్రీరామ్ నిర్వహిస్తారు.
అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ రిస్క్ కలిగి ఉంటుందని గమనించాలి. సరైన ఫండ్‌ని ఎంచుకునేందుకు మార్కెట్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే తమ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి. లేదంటే నష్టపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో సగటున 12 శాతం రాబడి వస్తున్న క్రమంలో ఎక్కువ మంది ఇటువైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.