అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వరలక్ష్మి సత్యనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. గురువారం ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 11. 30 సమయంలో వేదపండితులు శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి, వరలక్ష్మి అమ్మవారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.