రాయదుర్గం నియోజక వర్గం గుమ్మగట్ట మండలం గోనబావికి చెందిన వృద్ధురాలు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పద్మావతి(60) కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగు మందు తగ్గిందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది.