రాయదుర్గం: బొమ్మనహల్ మండలంలోని లైబ్రరీ అద్వాన స్థితికి చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి టాపు నుండి నీరు కారుతూ పెచ్చులు ఊడి పడుతున్నాయని పాఠకులు తెలిపారు. బిక్కు బిక్కు మంటూ తాము చదువుకొని వెళుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైబ్రరీ నూతన భవన నిర్మాణం చేపట్టి పాఠకులకు అండగా నిలవాలని గురువారం కోరారు.