ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ గురువారం విలేఖరులతో తెలిపారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్, పార్టమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15వ తేదిన కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.