ప్రతిరోజూ మల్టీవిటమన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆయుష్షు పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కారణం కావొచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు తేల్చారు.