డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ముఖ్యంగా నీరు, కొబ్బరి నీరు, పలుచగా చేసిన పండ్ల రసాల, బొప్పాయి ఆకుల రసం తీసుకోవాలి.ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను అందజేస్తాయి. సూప్‌లు, గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తినండి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, వ్యాధితో పోరాడటానికి సహాయపడతాయి.