పచ్చి టమాటోలలో విటమిన్ ఎ, సి తోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. పచ్చి టమాటోలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ సంబంధిత కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా టమాటో ఉపయోగపడుతుంది.