మన ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. అలాగే సరైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన, తినటానికి కూడా సరైన టైమ్ లేకపోవడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్యలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. దీనిలో ఒకటి చెడు కొలెస్ట్రాల్. మరొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ అనేది మన శరీరాన్ని ఎంతో రక్షిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎంతో మందిలో ఈ కొవ్వు అనేది అతివేగంగా పెరుగుతుంది. దీని వలన ప్రాణాంతకమైన వ్యాధుల భారీనా పడుతున్నారు. ఈ సమస్య అనేది పురుషులలో కన్నా మహిళలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మహిళలు ఆరోగ్యపరంగా ఎంతో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ వలన ఎలాంటి సమస్యలు వస్తాయి మరియు దీని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…
దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు : శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగినట్లయితే ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.అయితే ఈ లక్షణాలు అనేవి అందరిలో ఒకేలా ఉండవు. ఈ లక్షణాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. వీలైనంత తొందరగా ఈ సమస్య నుండి బయట పడటం ఎంతో ఉత్తమం. లేకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి..
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు : శరీరంలో ఎక్కువ పరిమాణంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతే ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుండెకు మరియు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ అనేది ఆగుతుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగితే రక్త ప్రసరణ వ్యవస్థ పై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. అలాగే గుండె నొప్పి సమస్యలు మరియు శరీరంలో ఇతర భాగాలలో నోప్పులు మొదలవుతాయి.
కాళ్లలో నొప్పులు : ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లయితే, కాళ్ల నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ సమస్య రావటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే. శరీరంలో కొవ్వు పెరగటం వలన రక్తప్రసరణ అనేది సరిగ్గా జరగదు. అలాగే కాళ్లలో రక్తనాళాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే పాదాలలో నొప్పులు కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువసేపు నిలబడటానికి కష్టమవుతుంది. ఈ నొప్పుల వలన ఎలాంటి పనులు చేయలేరు. అంతేకాక అధికంగా చెమటలు కూడా పడుతూ ఉంటాయి. మీకు ఇలాంటి సమస్యలు గనుక ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది…