దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో బులియన్ మార్కెట్లో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.950 తగ్గి రూ.71,050లకు పరిమితమైంది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం 99.9 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.72 వేలు పలికింది. అలాగే 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1650 తగ్గి రూ.70,700లకు చేరుకున్నది. శనివారం నాడు రూ.72,350 వద్ద స్థిర పడింది. ఇక కిలో వెండి ధర రూ.4500 తగ్గి రూ.84,500లకు పరిమితమైంది. శనివారం కిలో వెండి ధర రూ.89 వేలు పలికింది.