టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి వైఎస్సార్సీపీపై మండిపడ్డారు. అధికారం ఉన్నప్పుడు జగన్ ఇంత గగ్గోలు పెట్టలేదని, నేడు ఏం చేసైనా పోగొట్టుకున్న అధికారం పొందాలని అతిగా ఆవేశపడుతున్నాడని మండిపడ్డారు. 31 రాజకీయ హత్యలు అని అబద్దాలు చెప్పడం అవగాహన లేని మాటలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 రాజకీయ హత్యలు ఎక్కడ జరిగాయో ధైర్యం ఉంటే పేర్లు చెప్పాలని ఆయన నిలదీశారు. జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి సంపాదన ఉందని ఢిల్లీకి ఎగేసుకుపోతారా? అని ప్రశ్నించారు. ‘‘జగన్ రెడ్డికి తప్పుడు పేరు పెట్టారు... వైఎస్ గ్లోబెల్స్ రెడ్డి’’ అని పేరు పెట్టి ఉండాల్సిందని పంచ్‌లు వేశారు.