ప్రతి రోజూ తప్పనిరిగా 30 నిమిషాల పాటు నడవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేసినప్పుడు మన శరీరంలో ఎండోర్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా స్ట్రెస్ తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే నడక వల్ల అల్జీమర్స్, డైమెన్షియా వంటి మతిమరపు సమస్యలు రాకుండా ఉంటాయి. కంటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. చూపు కోల్పోయేందుకు కారణమయ్యే గ్లకోమాను అడ్డుకుంటుంది. గుండె జబ్బులు రాకుండా నడక కాపాడుతుంది.