తాడిపత్రి పట్టణంలోని పెన్నానది తీరాన వెలసిన శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మ వారు శుక్రవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని ఉదయం అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నందుస్వామి, రామకృష్ణశర్మలు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, నిమ్మపండ్ల హారాలతో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.