ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ, వాటిని సీజ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ మందులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందులు కొనే సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని డీసీఏ హెచ్చరిస్తుంది.