మనకి ఎదుట ఉండే వ్యక్తి ఎవరైనా ఆవలిస్తే మనకి కూడా ఆవలింతలు వస్తాయి. అయితే.. తెలియని వారి కంటే బంధువు లేదా స్నేహితుడి ఆవలింతలను చూసినప్పుడు ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకే అవకాశాలు ఎక్కువని, కాబట్టి ఇది సహానుభూతికి సంబంధించినది కావొచ్చని పరిశోధకులు చెప్పారు. ఒక వ్యక్తి మరొకరిని అనుకరించేలా చేసే మిర్రర్ న్యూరాన్ ల వల్ల కూడా ఇది సంభవించవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.