ప్రోటీన్, మంచి పోషక వనరులలో గుడ్లు ఒకటి.. అందుకే.. గుడ్డు ఆరోగ్యానికి వెరీగుడ్డు అంటారు.. గుడ్లతో కూడిన అల్పాహారం చాలా ఆరోగ్యకరమైనది. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, వివిధ మినరల్స్ మన శరీరంలోని వివిధ అవయవాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి.అందువల్ల గుడ్లను చౌకగా, సులభంగా లభించే సూపర్ ఫుడ్ అంటారు. ఇవి అన్ని వయసుల వారికి మంచివి.. ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా సహాయపడతాయి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలంటే ఆహారంలో గుడ్లు తప్పనిసరిగా చేర్చాలి. ఒక పెద్ద గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.. ఇది కండరాల బలానికి ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా గుడ్లు మేలు చేస్తాయి.
విటమిన్లు - ఖనిజాలు: గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు.. అనేక ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో చాలా ప్రొటీన్లు ఉంటాయి. ఇది చాలా పోషకాలను కలిగి ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రోటీన్ - గుడ్డు పచ్చసొనలో 2.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.. ఇది మన కండరాలను నిర్మించడంలో, బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శరీర కండరాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.లుటిన్- గుడ్లలో ఉండే లుటిన్ మెదడు అభివృద్ధికి- మన జ్ఞాపకశక్తికి పదును పెట్టడానికి సహాయపడుతుంది.
విటమిన్ డి- గుడ్లలో విటమిన్ డి ఉంటుంది. దృఢమైన ఎముకలకు విటమిన్ డి అవసరం. ఇది ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.విటమిన్ ఎ- గుడ్డు సొనలో విటమిన్ ఎ తగినంత మొత్తంలో ఉంటుంది, ఇది మన కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు - గుడ్లు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.రోగనిరోధక వ్యవస్థ - గుడ్లలో సెలీనియం, ప్రోటీన్లతో పాటు విటమిన్లు A, D, E, B12 పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడం- గుడ్లు తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. ఫలితంగా మీరు తక్కువ కేలరీలు వినియోగిస్తారు. గుడ్లలో సరైన మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇంకా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.