జీవితంలో కొన్ని పద్ధతులను అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు వృద్ధాప్యంలోనూ మెదడు పనితీరును కాపాడుకోవచ్చని న్యూరాలజిస్ట్ డా. సుధీర్ కుమార్ చెప్పారు. "రాత్రిపూట 7-8 గంటలపాటు మంచి నిద్ర, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం, మెదడుకు పదును పెట్టే పజిల్స్ ను పరిష్కరించడంతో పాటు టీవీ చూడటం తగ్గించాలి" అని ఆయన సూచించారు.