మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్ణ సమస్య తలెత్తుతుంది. దాని వెనుకే గ్యాస్ సమస్య కూడా వచ్చి పడుతుంటుంది. ఇక ఇవి రెండు వచ్చాయంటే కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి ఈ సమస్యను తగ్గించుకోవడాని కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణాశయంలో చల్లదనాన్ని పెంచడంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. కడుపునొప్పి కూడా తగ్గుతుంది.