పారిస్ ఒలింపిక్స్ తర్వాత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి దిరిగొచ్చింది. ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినేశ్ ఫొగాట్ తల్లి ప్రేమలత విలేకరులతో మాట్లాడారు. ‘నా బిడ్డే నాకు ఛాంపియన్. ఆమెకు ఈ దేశం గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ ఆత్మీయతను, గౌరవాన్ని ఇచ్చింది. మా గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఫొగాట్‌కు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.
నా కూతురును ఘనంగా సత్కరిస్తామన్నారు. దేశమంతా నా కూతురును గౌరవిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె ఇంటికి చేరుకున్నాక హల్వా తినిపిస్తాను’. అని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో ఫైనల్లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. అనర్హత వేటు నేపథ్యంలో తనకు కాంస్యం ఇవ్వాలంటూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించారు. సీఏఎస్‌లో ఆమెకు చుక్కెదురైంది.