ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబరు 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. ఉపాధ్యాయులతోపాటు విద్యా శాఖలో ఇతర ఉద్యోగులకూ బదిలీల్లేవు. వైద్య ఆరోగ్య, వ్యవసాయ అనుబంధ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించలేదు.