బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి నివేదిక రూపొందించింది. ‘బంగ్లాదేశ్లో నిరసనలు, హింసపై ప్రాథమిక విశ్లేషణ’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. కాగా, బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మరణించినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన ఘటనల్లోనే 250 మంది వరకు మరణించారని పేర్కొంది.
మృతుల్లో భద్రతా సిబ్బంది, జర్నలిస్టులు కూడా ఉన్నారని ఐక్యరాజ్యసమితి వివరించింది. కాగా, బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలంటూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపుదాల్చడం, ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన భారత్లో తలదాచుకోవడం, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు అందుకోవడం తెలిసిందే.