మన శరీరంలో రక్తం అనేది ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడమే ‘రక్తహీనత’. దీన్నే ‘అనీమియా’ అంటారు. కేంద్ర ఆరోగ్య శాఖ సూచన ప్రకారం.. శారీరకంగా అలసట, ఆకలి తగ్గడం, త్వరగా ఆయాసం రావడం, చేసే పని మీద ఏకాగ్రత కుదరకపోవడం, చర్మం, ముఖం నాలుక, కళ్ల చుట్టూ పాలిపోవడం, ముఖం, పాదాల వాపు లాంటి లక్షణాలు రక్తహీనతను సూచిస్తాయని తెలిపింది.