శొంఠిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా యువతులు, మహిళల్లో నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి వచ్చినప్పుడు కాస్త శొంఠితో చేసిన టీ తాగితే వెంటనే ఉపశమనం ఉంటుంది. ఇక శొంఠి వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా శొంఠి దోహదం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు రావు.