మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. లవంగాలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అందుకే లవంగాలను తరచుగా తినమని చెబుతూ ఉంటారు వైద్యులు. లవంగాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ ప్రతిరోజు లవంగాలను తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల జీవక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. లవంగాల వాడకం జీర్ణక్రియకు మంచిది.
లవంగాలు సహజంగా ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే భోజనం తర్వాత రెండు లవంగాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ చికాకు, అజీర్తి, వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరచడంలో మరింత సహాయపడుతుంది. అంతేకాదు లవంగాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. లవంగాలలోని యూజినాల్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా శుద్ధి చేయడం ద్వారా రక్తంలో విషపూరిత స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లవంగాలతో టీ తయారు చేసి కూడా తీసుకోవచ్చు. దీంతో సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులను ఎదుర్కోవడానికి కావలసిన నిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగాలు ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. వీటిలో యూజినాల్, ఫ్లేవనాయిడ్స్ వంటి హైడ్రో ఆల్కహాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆహారంలో తక్కువ మోతాదులో రోజూ లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది. ఇది సహజంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బోలు ఎముక వంటి ఎముక సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. లవంగం నూనె, లవంగాల పదార్దాలలో యూజినాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది వాపు వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే లవంగాలను ఆహారంలో చేర్చడం లేదా ప్రభావిత ప్రాంతాల్లో లవంగం పేస్ట్ని పూయడం వల్ల అధిక నొప్పిని నయం చేయవచ్చు. పంటి నొప్పిని తగ్గించడానికి లవంగం నూనెను కూడా ఉపయోగిస్తారు. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి లవంగంలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు వైద్యులు.