మన శారీరక వ్యవస్థలు సరిగా పని చేయాలంటే కొన్ని పోషకాలు, ప్రోటీన్లు అవసరం ఇలాంటి వాటిలో హిమోగ్లోబిన్ ఒకటి అయితే ఐదు ఐరన్ రిచ్ ఫుడ్స్ డైట్‌లో యాడ్ చేసుకుంటే హిమోగ్లోబిన్ లెవల్స్ తొందరగా పెరుగుతాయి.ఖర్జూరాలు : ఖర్జూరలో ఐరన్, విటమిన్ A, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లోని ఐరన్ కంటెంట్, రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్‌ను పెంచుతుంది. ఖర్జూరాలను రెగ్యులర్‌గా తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా తినవచ్చు లేదా స్మూతీస్, డెజర్ట్‌లలో యాడ్ చేసుకోవచ్చు.దానిమ్మ: దానిమ్మలో ఐరన్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా దానిమ్మ రసం తాగడం లేదా పండ్లను తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. ఈ ఫ్రూట్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, మొత్తం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది.
పాలకూర: పాలకూరలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఐరన్, A, C విటమిన్లకు ఇది నిలయం. పాలకూరలో కేలరీలు చాలా తక్కువగా, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది. ఈ ఆకు కూరలతో కూరలు, ఇతర వంటకాలు చేసుకోవచ్చు. సలాడ్స్, సూప్స్ లేదా సైడ్ డిష్‌గా కూడా డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు.
బీట్‌రూట్: బీట్‌రూట్‌లో ఐరన్, విటమిన్ C, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపర్చగలవు. బీట్‌రూట్‌ను కర్రీస్, సలాడ్స్, స్మూతీస్ లేదా సైడ్ డిష్‌గా కూడా తినవచ్చు.
పప్పు ధాన్యాలు: వివిధ రకాల కాయ, పప్పు ధాన్యాల్లో మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఐరన్, ప్రోటీన్, ఫైబర్‌కు ఇవి బెస్ట్ సోర్స్. వివిధ రకాల పప్పులు తింటే శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. డైజేషన్ రేట్ పెరిగి, గట్ హెల్త్ కూడా బాగుంటుంది. వీటితో పప్పు, సాంబార్, ఇతర డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.